telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 31 వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే.. నిర్మల ఇంటి పాలేరు హేమ ఇంటికి వొచ్చి అమ్మా నిర్మలమ్మగోరూ.. మిమ్మల్నీ, చెల్లెమ్మగారినీ.. వున్నపళంగా వెంటబెట్టుకుని అయ్యగారు చెప్పేరండి.. తొందరగా ఇంటికి పదండమ్మా .. అంటూ నిర్మల పాలేరు నిర్మలనీ.. సరితనీ తొందరపెట్టేడు..
వురుములేని మెరుపులా వూడిపడి తొందరచేస్తున్న తమ ఇంటిపాలేరుమీద చికాకుపడుతూ.. నిర్మల.. ఏంటిరా ఆ తొందర.. వున్నపళంగా ఇప్పుడు ఇంటికివొచ్చినంత మాత్రాన అక్కడ అంత కొంపలు మునిగిపోయే పనులేమున్నాయని..? అంటూ నిర్మల పాలేరుని విసుక్కుంటుంటే.. దానికి వాడు..
లేదమ్మగారూ.. మిమ్మల్నీ మీ చెల్లెలిగారినీ చూసుకోవడానికి పట్నమ్నించీ ఎవరో పెళ్ళికొడుకు తల్లితండ్రులు వొచ్చేరంట.. అందుకే అక్కడ అమ్మగారూ.. అయ్యగారూ.. మీరెక్కడికి వెళ్ళేరో అని ఖంగారుపడుతుంటే.. మీరు ఇక్కడ హేమమ్మగారి ఇంట్లో వుంటారని చెప్పి అమ్మగారు నన్నిక్కడికి తోలేరండి.. వినయంగా సమాధానం చెప్పేడు పాలేరు..
ఇంట్లో పెళ్ళిసంబందం కోసమని పెళ్ళికొడుకు తల్లితండ్రులువొచ్చి కూర్చున్నారన్న మాట విని.. నిర్మల.. సరితా.. అక్కడున్న అందరి ముఖాలలోకీ.. ఆశ్చర్యంగా చూసేరు.. అకడున్న ఆడవాళ్ళందరి ముఖాలూ సంబ్రమాశ్చర్యాలతో ఒకరకమైన కాంతితో వెలిగిపోయేయి..
ముందుగా ఆ ఆశ్చర్యంనించీ తేరుకున్న సరిత.. పాలేరుని చూస్తూ.. నీవెనకాలే మేము వొస్తున్నాము .. ముందు గా నువ్వు ఇంటికి పరిగెత్తుకెళ్ళి అమ్మావాళ్ళని ఖంగారు పడొద్దని చెప్పు అని పాలేరుని ఇంటికి పంపించేసి.. ఒక్కసారిగా మోహన్‌ని బలంగా కౌగలించేసుకుని.. మోహన్ ముఖాన్ని ముద్దులతో ముచెత్తుతూ.. నీమాట నిజమయ్యేట్లే కనిపిస్తున్నాది మోహన్.. నీమాట నిజమయ్యేట్లే కనిపిస్తున్నాది.. చూడబోతే మాఇద్దరికీ పెళ్ళి జరిగే యోగం వొచ్చినట్లే వున్నది అన్నాది ఆనందంగా..
సరిత అన్న మాటల్ని అందుకుంటూ.. నీలు.., హేమా.. నేనూ.. గత వారం పదిరోజులుగా రోజూ రాత్రిళ్ళు పద్మా వాళ్ళ మేడమేదనే పడుకుంటున్నాం.. ఇప్పుడు ఇంటికి వెళ్ళి.. రాత్రి మీరిద్దరూ కూడా మాతోపాటూ మేడమీద పడుకోవడానికి వొచ్చెయ్యంది.. మీ పెళ్ళిచూపుల ముచ్చట్లని రాత్రి మనం అక్కడ మేడమీద మాట్లాడుకుందాము అని అందరి తరపునా నీలనే నిర్మలకీ, సరితకీ, ఆహ్వానం పలికేసింది..
నిర్మల.. సరితలు.. తప్పకుండా రాత్రికి పడుకోవడానికి పద్మ ఇంటికి వొస్తామని మాట ఇచ్చి.. పరుగుపరుగున వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేరు..
చెప్పినట్లుగానే ఆ రాత్రి ఇంటిపాలేరుతో పడుకోవడానికి పక్కలు తెప్పించుకుని రాత్రి 8:00 గంటలయ్యేప్పటికి నిర్మల, సరితలు ఇద్దరూ పద్మ ఇంటి మేడమీద వాలిపోయేరు..
చెప్పినట్లుగానే ఆ రాత్రి ఇంటిపాలేరుతో పడుకోవడానికి పక్కలు తెప్పించుకుని రాత్రి 8:00 గంటలయ్యేప్పటికి నిర్మల, సరితలు ఇద్దరూ పద్మ ఇంటి మేడమీద వాలిపోయేరు..
నిర్మల .. సరితల మొహాలుచూడగానే అక్కడున్నవాళ్ళందరికీ అర్ధమైపోయింది.. ఆ సంబంధం ఎదో ఖాయమైనట్లే కనిపిస్తున్నాదని.. ఐనప్పటికీ ఏంజరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రం కొద్దీ.. నీలు, హేమ, పద్మలు.. వాళ్ళిద్దరినీ చుట్టుముట్టేసి ఎంజరిగిందని ఆత్రంగా అడిగేప్పటికి నిర్మల .. సరితలు.. హేమా వాళ్ళ ఇంటినించీ వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పటినించీ.. ఏంజరిగిందో వివరంగా వివరించి చెప్పడం మొదలుపెట్టేరు..
వీళ్ళని చూసుకోవడానికి వొచ్చినది పెళ్ళికొడుకుల తల్లితండ్రులు.. పెళ్ళికొడుకులిద్దరూ గవరమెంట్ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్లు.. అదీకాక పెళ్ళికొడుకులిద్దరూ కవలపిల్లలంట గూడానూ.. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబమని చెప్పుతూ.. వాళ్ళ మంచితనానికి నిదర్శనమూ.. పెళ్ళికొడుకులిద్దరూ గవరమెంట్ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్లైనాకానీ.. ఇంతకాలం వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగకపోవడం గురించి కారణం ఇలా చెప్పుకొచ్చేరు..
అదేమిటంటే..
పెళ్ళికొడుకుల తండ్రి.. అంటే నిర్మల, సరితలకి కాబోయే మావగారు ఆయనకూడా గవర్నమెట్ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసరే.. తెలిసినవాళ్ళు వ్యాపారం పెట్టుకుంటామంటే మంచితనానికి పోయి ఈయక కొన్నిదగ్గర్ల హామీ సంతకాలు పెట్టేరు.. వాళ్ళు వ్యాపారంలో డబ్బులన్నీ వాళ్ళ వాళ్ళ కుటుంబసభ్యులపేర్లమీదకి మళ్ళించేసి.. ఐ.పీ. పెట్టెయ్యడంతో.. మాకాబోయే మావగారితోపాటుగా ఇలాంటి మంచివాళ్ళు మరో 10/15 మందిదాకా వాళ్ళ అప్పులు కట్టడానికి అరిగిపోయేరట.
కన్నతండ్రి మంచితనానికి పోయి అప్పులపాలైపోవడంతో.. కొడుకులిద్దరూ కూడా తండ్రి అప్పులని తీర్చేవరకూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదని పట్టుపట్టడంతో.. ఇంతకాలం పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం ఆలస్యమయ్యిందని చెపుతూ.. ఐతె అదృష్టవశాన రెండు మూడేళ్ళక్రితమే పిల్లలిద్దరూ అప్పులన్నీ తీర్చేసేరట. ఐనఆలస్యం ఎటూ అయ్యిందని ఇప్పుడు వీళ్ళు ముగ్గురూ కలిసి పట్నంలో సొంత ఇల్లు కట్టుకుని బాంక్‌లో మంచిగా డబ్బులు కూడేసుకునేవరకూ ఆగి ఇప్పుడు పిల్లలిద్దరూ పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పడంతో.. నిర్మల, సరితలకి మంచి కుటుంబం నించే సంబందం వొచ్చినదని హేమ, నీలు, పద్మ, మోహన్‌లు చాలా సంతోషించేరు..
మరి ఇంతకీ మీ అత్తమామల అభిప్రాయమేమిటని పద్మ అడిగేప్పటికి.. సరిత.. కల్పించుకుంటూ.. ఈ హామీ సంతకం దెబ్బతో ఆ కుటుంబం వాళ్ళు సంబందాలు చూడ్డానికే భయపడిపోయి.. ఒకే కుటుంబం నించీ అప్పచెల్లెళ్ళని తెచ్చి అన్నదమ్ములిద్దరికీ పెళ్ళిచేస్తే కనీసం కుటుంబంలోఅన్నా గొడవలు లేకుండా వుంటాయని వాళ్ళు బాగా చదువుకున్న అమ్మాయిలూ వున్నా సంబంధాల కోసం వెతుకుతుంటే మా సంబంధం గురించి వాళ్ళ స్నేహితుల స్నేహితుడు ఎవరో ఈవూళ్ళో మా ఇద్దరు అప్పచెల్లెళ్ళ సంబంధం ఉందని చెపితే మాకోసమని వాళ్ళు ఇలా చెప్పా పెట్టకుండా వోచేరట. ముందుగా మాట చెప్పి వొస్తే మా పరిస్థితులు అవగాహనకి రావని.. ఇలా చడీ చప్పుడులేకుండా మాఇంటికి పెళ్లి చూపులకి వొస్తే మా కుటుంబ పరిస్థితులూ చూసినట్లు ఉంటుందని అలా చెప్పా పెట్టకుండా వొచ్చేరని చెప్పింది.
మరి మీరిద్దరూ వాళ్లకి నచ్చేరా అని అడిగితె.. మా ఇద్దరి చదువులూ అవీ వాళ్ళకి నచ్చినట్లే అనిపిస్తున్నది.. కానీ వాళ్ళు ముందు జాగ్రత్తకోసమని పెళ్ళిచేసుకోవలసింది అబ్బయిలు కదండీ.. ఈ వారంతం లోపులో మంచిరోజు చూసుకుని అబ్బాయిలిద్దరితోనూ కలిసి మళ్ళీ వొస్తామని వాళ్ళు చెప్పేరు అని సరిత చెప్పింది..

0 Comments