telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 36 తెల్లవారి సోమవారం వుదయం నిర్మల, సరిత, హేమా, నీలిమలు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేరు.
తరువాత, నీల స్త్ననం చేసి టిఫెను తిని, మళ్ళీ పద్మ ఇంటికి వెళ్ళడానికని వెళుతూ వెళుతూ హేమని కూడా వెంటపెట్టుకుని పద్మ దగ్గరకి వెళ్ళాలని హేమా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నీలు రావడం చూసి హేమ కూడా తెయారయ్యి మంచి బట్టలు కట్టుకుని సుబ్బరంగా ముస్తాబయ్యి పద్మ ఇంటికి వెళ్ళబోతుండగా హేమా వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడొకతను హేమా వాళ్ళ ఇంటికి వొచ్చేడు.
నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు ఇంటికి రావడంతో పద్మ ఇంటికి బయలుదేరబోతున్న హేమ కస్తా ఆగిపోయింది. అదిచూసిన హేమ తండ్రి హేమతో, నీకిక్కడ పనేమీ లెదు తల్లీ.. నువ్వు కావాలంటే నీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోవచ్చన్నాడు..
అమ్మ అన్నింటికీ ఎంకస్టపడుతుంది లెండి నాన్నగారూ.. అక్కడకి వెళ్ళి మేము మాత్రం చేసే పనేముంది చెప్పండి? ఇక్కడవుంటే మీకు, మీ స్నేహితుడికీ, అమ్మకీ ఎదన్న చేతిసాయంగా వుంటాము కదా.. అన్నాది..
హేమ అంటున్న మాటలు వింటున్న హేమ తండ్రి స్నేహితుడు నువ్వు నీ ఆడపిల్లలిద్దరినీ చాలా చక్కగా పెంచేవురా అని హేమ నాన్నగారిని మెచ్చుకున్నాడు.
స్నేహితుడు అన్న మాటకి నవ్వుతూ హేమ తండ్రి, హేమని చూపిస్తూ ఈమె నా కూతురు, ఆ పక్కనున్నది నీలిమ, మేమంతా తనని నీలు అని పిలుస్తాము, ఆమె హేమ చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పటినించీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మనలాగే. వీళ్ళిద్దరూ ఎక్కడకి వెళ్ళినా జంటకవుల్లా తిరుగుతూవుంటారు. వీళ్ళ స్నేహితులు వీళ్ళని ఫెవికాల్ అని పిలుస్తారు అని నవ్వేస్తూ తనకూతురినీ నీలనీ పరిచెయం చేసేడు హేమ తండ్రి.
నిజానికి ఆ స్నేహితుడు కూడా ఈ ఊరువాడే ఐతే పెద్దచదువులు చదువుకోవడంతో అతనికి పట్నంలో పెద్ద వుద్యోగం వొచ్చింది. అందువల్ల వూళ్ళోవున్న 6 ఎకరాల భూమినీ కౌలుకి ఇచ్చేసేడు. ఇప్పుడు ఆ కౌలుదారుడు సరిగ్గా డబ్బులు ఇవ్వడంలేదని ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికాని మళ్ళీ ఊళ్లోకి వొచ్చేడు. ఈయన కౌలుదారుడి దెగ్గరికి వెళ్లబోతుంటే హేమ అడ్డుపడి.. భూమి మీది.. మీ భూమిమీద బ్రతుకుతున్నది ఆతను. మీరు వాడిదగ్గరకి వెల్లడమేమిటి..? వుండండి కబురుపెడదాం అని హేమే పక్కింటి పోరగాడిని పిలిచి నాన్నగారి స్నేహితుడి పొలాన్ని కౌలుచేస్తున్న రైతుకి కబురు పంపించింది హేమ.
హేమ కబురుపంపిన వార్తా అందుకున్న రైతు పరుగుపరుగున హేమా వాళ్ళ ఇంటికి వొచ్చి హేమ నాన్నగారి స్నేహితుడిని కలిసి కౌలు వ్యవహారాల్ని మాట్లాడుతుంటే, మధ్యలో హేమ కలగచేసుకుంటూ.. నాన్నగారి స్నేహితుడిని మామయ్యగారూ చిన్నపిల్లని నేను మధ్యలో కలగచేసుకుంటున్నానని అనుకోకపోతే ఒక్కసారి మీరు లోప్లలికి వొస్తే నేను మీలో ఒక విషయాన్ని మాట్లాడుదామని అనుకుంటున్నాను అన్నాది.
హేమ అంత ముమరియాదగా అంత ముచ్చటగా పిలిచేప్పటికీ ఆ పెద్దాయన ముచ్చటపడిపోతూ హేమతో పాటు లోపలిగదిలోకి వెళ్లి విషయం ఏమిటని అడిగేడు. అప్పుడు హేమ ఆ చుట్టుపక్కల పొలాలకు ఇప్పుడు కౌలుదారుడిస్తున్న కౌలుకి రెండింతల కౌలు ఇస్తున్నారని చెపుతూ ఎట్టిపరిస్థిల్లోనూ ఇప్పుడు ఇస్తున్న కౌలు డబ్బులకి ఆయన పొలాన్ని తిరిగి ఆ రైతుకి కౌలుకి ఇవ్వొద్దని గట్టిగా చెప్పింది. హేమకి వున్నా విషయం పరిజ్ఞానానికి ముచ్చటపడిన ఆ పెద్దాయన హేమ ఈ వ్యవహారాన్ని ఎలా చెక్కబెడుతుందో చూడాలని చెప్పి రైతుతో కౌలు విషయాన్ని మాట్లాడేపనిని హేమకే అప్పచెప్పేడు.
దానితో హేమే రైతుతో మాట్లాడి ఇప్పుడు ఇస్తున్న కౌలుకి రెండింతల కౌలు ఇచ్చేటట్లు, ఒకవేళ అతివృష్టి అనావృష్టి లాంటివి వొచ్చి వానలు కురవక పోయినా, లేక వానలు ఎక్కువై పంటలు పాడైపోయినా, లేదా పంట చేతికొచ్చే సమయానికి అకాలంగా వానలొచ్చి పంట నష్టపోయినా కానీ ఇరుపక్షాలవాళ్ళూ కూర్చుని మాట్లాడుకునేలా.. ఒప్పందం కుదిరించింది. రైతు ఆ పెద్దాయన్ని మోసం చెయ్యకుండా ఉండేలా చూడవలసిన బాధ్యతని హేమ ఎప్పుడూ ఆవూరిలోనే వుండే తన తండ్రిమీద పెడుతూ.. ఇలాంటి బాధ్యతని తీసుకునేవాళ్ళకి ఎటువంటి లాభం లేకపోతె తన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించరు గనక ఇక్కడి పంటల వ్యవహారాల్ని హేమ తండ్రి దెగ్గరుండి గమనించడానికి గాను సంవత్సరానికి ఇంతని హేమ తండ్రికి ఆయన స్నేహితుడు ముట్టచెప్పేలా మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టింది.
అంతపెద్ద కౌలు వ్యవహారాన్ని పెద్దగా చదువుకొని హేమ నిర్వహించిన హేమ కార్యదక్షతనీ, హేమ వాక్చాతుర్యాన్నీ, ఈ బేరసారాలు జరిపేసమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా, ఎక్కడా ఒక్కమాట తూలకుండా, ఎక్కడా ఎవ్వరి మనసు నొప్పించకుండా వ్యవహారాన్ని చాకచేక్యంగా హేమ నడిపించిన విధానం చూసి ఆ పెద్దాయన ముగ్ధుడైపోయేడు.
ఆరోజు మధ్యాహ్నం తన స్నేహితుడి ఇంట్లోనే భోజనం చేసి తన వూరికి వెళ్ళడానికి బయలుదేరబోతూ తన స్నేహితుడి చేతులుపట్టుకుని నీ కూతురు నాకు చాలా బాగా నచ్చింది. మా కొడుకులిద్దరూ కూడా వీళ్ళిద్దరినీ నచ్చుకుంటారు. నీకు అభ్యంతరం లేకపోతె వీళ్ళిద్దరినీ నా ఇద్దరు కొడుకులకీ ఇచ్చి పెళ్లిళ్లు చేసి వీళ్ళని నా ఇంటి కోడల్లుగా చేసుకుందామని అనుకుంటున్నాను.. ఇంతటి మంచి స్నేహితులైతే కోడళ్ళిద్దరూ కలిసిమెలిసివుంటారు.. నాకుటుంబం చల్లగా ఉంటుంది.. నీకేమన్న అభ్యంతరమా..? అని హేమ తండ్రిని అడిగేడు..
అయాచితంగా అంతపెద్ద స్థితిలోవున్న తనస్నేహితుడు అలా అడిగేప్పటికీ హేమతండ్రి ఆననందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేడు. తన కూతురిని తన స్నేహితుడి కొడుక్కిచ్చి చెయ్యడానికి తనకి ఎటువంటి అభ్యంతరంలేదని చెపుతూ.. మరి నీల సంగతి వాళ్ళ తల్లితండ్రుల్ని అడగాలని అప్పటికప్పుడే నీల తల్లితండ్రులకి కబురుపెట్టెప్పటికీ నీల తల్లితండ్రులు పరుగుపరుగున హేమా వాళ్ళ ఇంటికి వొచ్చేరు.
హేమత్రండ్రి తన స్నేహితుడిని పరిచేయంచేసి తన స్నేహితుడి స్తితిగతులనీ, వాళ్ళ పిల్లల ఉద్యోగాది విషయాలని వివరించి హేమనీ, నీలనీ తన స్నేహితుడి ఇంటి కోడళ్ళుగా ఆడుతున్నారని చెపుతూ ట్యాంవొంతుగా హేమని అతని పెద్దకొడుక్కి ఇచ్చిచెయ్యడానికి అభ్యంతరంలేదని చెపుతూ.. ఒక్కసారి తన స్నేహితుడి భార్య పిల్లలూ వొచ్చి తన కూతురిని చూసి నచ్చుకుంటే వెంటనే తాంబూలాలూ పెళ్ళిముహూర్తాలూ పెట్టేసుకుంటామని చెప్పేసేడు.

0 Comments